Kubera: `కుబేర' రిలీజ్ డేట్ వచ్చేసింది.. 1 y ago
వరుస సినిమాలతో జోష్ మీదున్న రష్మిక తాజాగా మరో సినిమాతో అలరించేందుకు సిద్ధమైంది. నాగార్జున, ధనుష్లతో కలిసి 'కుబేర అంటూ పలకరించనున్నారు. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. తాజాగా విడుదల తేదీని తెలుపుతూ ఓ ఆసక్తికర పోస్టర్ ను టీమ్ షేర్ చేసింది. జూన్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పంచుకున్న పోస్టర్లో నాగార్జున, ధనుష్లు ఎదురెదురుగా ఉండగా మధ్యలో బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ కనిపిస్తున్నారు.